iBomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. మరోసారి కస్టడీకి కోర్టు అనుమతి
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:39 PM
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై (iBomma Ravi Case) నాంపల్లి కోర్టులో(Nampally Court) ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మూడు కేసుల్లో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.
ఒక్కో కేసుకు ఒక్కో రోజు కస్టడీ అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. అయితే, నాలుగు కేసుల్లో ఒక కేసు కస్టడీ తిరస్కరణకు గురైంది. పోలీసుల వాదనలతో ఏకీభవించి ఐబొమ్మ రవిని కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను కస్టడీకి తీసుకొని విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఈ క్రమంలోనే శనివారం, సోమవారం, మంగళవారం ఐబొమ్మ రవిని కస్టడీ విచారణ చేయనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రవి బెయిల్‌పై సోమవారం వాదనలను మరోసారి విననుంది నాంపల్లి కోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News