Minister Uttam Discussed ON Kaleshwaram Report: లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:25 PM
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Report) తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) చర్చ జరుగుతోంది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy). కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87,449 కోట్ల ఖర్చు అయిందని తెలిపారు. నిరుపయోగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ కూలిందని వివరించారు. 20 నెలల నుంచి ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రాణహిత - చేవెళ్లపై 2014 నాటికే రూ.11,600 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు సరికాదని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పిందని వివరించారు. వాప్కోస్ రిపోర్టు రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజ్‌ను కట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. సాంకేతిక అంశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే మంత్రి ఉత్తమ్ ప్రసంగానికి అడుగడుగునా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని తెలిపారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు నాలుగు ఏళ్లలోనే కూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచే ఈ ప్రాజెక్టులో లోపాలు బయట పడ్డాయని క్లారిటీ ఇచ్చారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వినలేదని.. దాని ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజ్ కూలిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడిన కీలక అంశాలివే..
కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరం.
2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ఆరు పిల్లర్లు కూలాయి.
కాళేశ్వరం ద్వారా ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు.
అందులో 30 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలేశారు.
రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుతో ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే ఉపయోగం
ఏడాదికి సగటున 20 టీఎంసీలు మాత్రమే ఉపయోగపడ్డాయి.
లక్ష కోట్లు ఖర్చుపెట్టి కొత్తగా రెండు లక్షల ఎకరాలకూ నీరివ్వలేదు.
రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు ఆరేళ్లలోనే కూలిపోయింది.
బ్యారేజ్ కట్టి డ్యామ్‌లా వినియోగించడం వల్లే మేడిగడ్డ కూలింది.
కెపాసిటీకి మించి స్టోరేజ్ చేయడం వల్లే డ్యామేజ్ జరిగింది.
అధికారులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది.
మేము కాళేశ్వరం వినియోగించకపోయినా రికార్డుస్థాయి పంట పండిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
మేడిగడ్డ కూలడానికి చాలా కారణాలు ఉన్నాయని NDSA చెప్పింది.
నిర్మాణం, నాణ్యత లోపాలు ఉన్నాయని NDSA చెప్పింది.
మీరు కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది.
మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
కాళేశ్వరంపై మాకు కక్ష సాధింపు లేదు.
బీఆర్ఎస్ వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది.
పీసీ ఘోష్ కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపింది.
మూడు బ్యారేజీలను కమిషన్ పరిశీలించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.
కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లను కమిషన్ ప్రశ్నించింది.
మాకు కక్ష సాధింపు లేదు.. నిజం తెలియాలన్నదే మా ఉద్దేశం.
చేసింది చాలదన్నట్లు కమిషన్‌పైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటూ విమర్శించారు.
కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కోర్టుకు కూడా వెళ్లారు.
నిజాలను ఎవరూ దాచిపెడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి.
కాళేశ్వరం తప్పిదాలకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని కమిషన్ తేల్చింది.
CWC అనుమతులు రాకముందే పనులు ప్రారంభించారు.
అనుమతులు రాకముందే కాంట్రాక్టులు అప్పగించారు.
తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవనే వాదన అబద్ధం.
కాళేశ్వరం తప్పిదాలపై అందరి సూచనల మేరకే చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News