Share News

Minister Thummala VS Kishan Reddy: కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి తుమ్మల ఫైర్

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:26 PM

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.

Minister Thummala VS Kishan Reddy: కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి తుమ్మల ఫైర్
Minister Thummala Nageswara Rao VS Kishan Reddy

హైదరాబాద్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): యూరియా పక్కదారి పట్టిందనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యలను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Thummala Nageswara Rao) తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు పక్కదారి పట్టేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. 11ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.


యూరియా సరఫరాలో జియో పాలిటిక్స్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎర్ర సముద్రంలో నౌకాయనం నిలవడంతో యూరియా ఇంపోర్ట్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో సరఫరా లేదని చెబుతూనే మరోపక్క యూరియా పక్కదారి పడుతోందని ఆరోపణలు చేయడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలో: కేటీఆర్

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

For More Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 04:32 PM