Swathi Muder Case: మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:22 PM
గర్భిణీని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మేడిపల్లి కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్య స్వాతిని ఆ కారణంతోనే అతి కిరాతకంగా చంపినట్లు హంతకుడు మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.
మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చానని మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. రెండు నెలల క్రితమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని తెలిపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మహేందర్ కు భార్యపై విపరీతమైన అనుమానం ఉండేది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి ఈ అనుమానం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే స్వాతిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని మహేందర్ అంగీకరించాడు.
ఇంటి ఓనర్స్ లేని సమయం చూసి భార్య హత్యకు ప్లాన్ చేశాడు. అనుకున్న ప్రకారం స్వాతిని చంపేసి శరీర భాగాలని రంపంతో ముక్కలుగా ముక్కలుగా కోశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం, కాళ్లు, చేతులు, తల భాగాలను కవర్లలో ప్యాక్ చేసి తీసుకెళ్లి మూసిలో పడవేశాడు. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఇంట్లోనే ఉంచాడు. దీంతో ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రాసాగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.
ఆ తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రస్తుతం మూసీలో పడవేసిన స్వాతి మృతదేహం భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు లభించటం లేదని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గర్భవతని చూడకుండా.. రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి.. మేడిపల్లిలో భర్త దారుణం..
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More Telangana News And Telugu News