Minister Jupally on Bathukamma: గిన్నిస్ బుక్ రికార్డులో చేరేలా బతుకమ్మ సంబరాలు: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Sep 18 , 2025 | 07:19 PM
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ (Bathukamma Festival) తెలంగాణ సంస్కృతని, ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యతని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బతుకమ్మ పండుగలో పెద్దఎత్తున పాల్గొని ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతాయని వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఈనెల 21వ తేదీన వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ పండుగ బాధల నుంచి పుట్టిందని చరిత్రలో ఉందని వివరించారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. బతుకమ్మ జరిగే ప్రాంతంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోనూ మన సంసృతి తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బతుకమ్మ పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. బతుకమ్మ పండుగ చేసుకున్న తర్వాత చెరువులో వదలాలని... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బతుకమ్మ పండుగపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు మంత్రి. బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి ఆత్మీయంగా చేసుకోవాలని.. ఇది వ్యక్తుల కార్యక్రమం కాదని, అందరి పండుగని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బతుకమ్మ పండుగను రాజకీయం చేశారు: మహేష్ కుమార్ గౌడ్

కొందరు బతుకమ్మ పండుగను రాజకీయం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వివిధ రకాల పాటలతో బతుకమ్మను రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగని ఉద్ఘాటించారు. మొదటిరోజు చేసుకునే ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గరి నుంచి చివరి సద్దుల బతుకమ్మ వరకూ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు.
బతుకమ్మ పండుగపై కొన్ని అపోహలు ఉన్నాయని మహేష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ తెలంగాణ పండుగ.. తెలంగాణ సంప్రదాయమని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్లీ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై కేటీఆర్ ఏమన్నారంటే...
లోకల్ అభ్యర్థిత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
Read Latest Telangana News And Telugu News