Share News

High Court on Local Candidate Dispute: లోకల్ అభ్యర్థిత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:00 PM

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.

High Court on Local Candidate Dispute: లోకల్ అభ్యర్థిత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court ON Local Candidate Dispute

హైదరాబాద్, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.


ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్‌లో చదివిన శశికిరణ్‌ను తెలంగాణ కోటా కింద పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థికి వెబ్ ఆప్షన్ ఇచ్చేలా, కౌన్సెలింగ్‌కు పిలవాలని హైకోర్టు సూచించింది. సైనిక్ స్కూల్‌లో చదివిన తెలంగాణ విద్యార్థులకు పదేళ్ల వరకు రాయితీ కొనసాగించాలని ఆదేశించింది. అడ్వకేట్ జనరల్ సమాధానంతో ఈ కేసు ముగించింది. అనంతరం పిటిషన్ డిస్పోజ్ చేసింది తెలంగాణ హైకోర్టు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 08:11 PM