Revanth Meets British High Commissioner: బ్రిటిష్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ భేటీ... చర్చించిన అంశాలివే
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:15 PM
యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో (Lindy Cameron) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (గురువారం) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ (Chevening scholarship) కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.
యూకే యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను కూడా బ్రిటీష్ హైకమిషనర్‌కు సీఎం రేవంత్ వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం కోరగా.. అందుకు బ్రిటీష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Wynn Owen), పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
ఓ వైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్‌లో వరుస సోదాలు
Read Latest Telangana News And Telugu News