Share News

TG Government on Collector: ఆ కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:22 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. నిన్న(బుధవారం) ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదు కలెక్టర్. ఈ విషయంపై ప్రభుత్వం ఆగ్రహించింది.

TG Government on Collector: ఆ కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్.. అసలు విషయమిదే..
TG Government on Collector Sandeep Kumar Jha

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Rajanna Sircilla Collector Sandeep Kumar Jha) పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సీరియస్ అయింది. నిన్న(బుధవారం) ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. జెండా ఆవిష్కరణ సమయానికి హాజరు కాకపోవడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ (Aadi Srinivas)కు స్వాగతం పలకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం వహించారు.


ఈ విషయంపై నిన్న (బుధవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవోకు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్ (Aadi Srinivas). దీంతో ఈ సంఘటనకు సంబంధించి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహారించిన తీరును సర్కార్ తప్పుబట్టింది. రోజురోజుకూ వివాదాస్పదంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మారుతున్నారని సర్కార్ సీరియస్ అయింది.

ఓ భూ నిర్వాసితుడి విషయంలోనూ నిన్న కోర్టు ఆయనకు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు(గురువారం) జిల్లావ్యాప్తంగా ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా నిరసన తెలిపారు బీసీ సంఘాల నేతలు. ఈ మేరకు కలెక్టర్ సంజయ్ ఝాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

లోకల్ అభ్యర్థిత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 07:47 PM