Drug Bust in Telangana: తెలంగాణలో డ్రగ్స్ దందా.. ఎక్సైజ్ శాఖ పకడ్బందీ తనిఖీలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:20 AM
హైదరాబాద్ నగరంలో పోలీసులు గురువారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్‌ను శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు విక్రయిస్తుండగా చాకచక్యంగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నగరంలో పోలీసులు ఇవాళ(గురువారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ (Drug Bust) స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్‌ను శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు విక్రయిస్తుండగా చాకచక్యంగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 5.14 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకుని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరో కేసులో.. మహేష్‌రెడ్డి అనే వ్యక్తి.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి 510 గ్రాముల గంజాయిని విక్రయిస్తుండగా.. మల్కాజిగిరి పోలీసులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. నిందితుల దగ్గర ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, ఘట్‌కేసర్ ప్రాంతంలో 1.227 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నాగపూర్ నుంచి బస్సులో గంజాయి తరలిస్తున్నారని ఎస్‌టీఎఫ్‌సీ టీం సీఐ వెంకటేశ్వర్లు నుంచి సమాచారం అందడంతో నాగపూర్ నుంచి వస్తున్న బస్సులను కొంపెల్లి, బాలాజీనగర్, జవహర్‌నగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ప్రభురాజ్ అనే వ్యక్తి నుంచి 1.227 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నిందితుడిని ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్టు హెచ్‌డీఎఫ్‌బీ టీమ్ ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఈ కేసుల్లో గంజాయి, డ్రగ్స్‌లను పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం, బీ టీం లీడర్ ప్రదీప్ రావులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్
Read latest Telangana News And Telugu News