Minister Tummala Nageswara Rao: నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి..
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:36 PM
ముడి పామాయిల్‌పై 2018లో 44 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 27 శాతం వరకు తగ్గిస్తూ.. వచ్చారని మంత్రి తుమ్మల వివరించారు. ఇటీవల 27.5 శాతం నుంచి 16.5 శాతానికి సుంకం తగ్గించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.
ముడి పామాయిల్‌పై 2018లో 44 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 27 శాతం వరకు తగ్గిస్తూ.. వచ్చారని మంత్రి తుమ్మల వివరించారు. ఇటీవల 27.5 శాతం నుంచి 16.5 శాతానికి సుంకం తగ్గించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సుంకాల తగ్గింపు ప్రభావం తెలంగాణ ఆయిల్ పామ్ రైతులపై తీవ్రంగా పడుతుందని చెప్పుకొచ్చారు.
దేశంలో అత్యధికంగా తెలంగాణలో 78,870 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. 56,231 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది మరో 50 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగుకు 18,185 మంది రైతులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరించారు. తిరిగి 44 శాతం దిగుమతి సుంకం విధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు