Share News

Vijay Devarakonda: ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:25 PM

బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారంలో ఈడీ అధికారుల ఎదుట టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హాజరయారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

 Vijay Devarakonda: ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు
Hero Vijay Devarakonda

హైదరాబాద్, ఆగస్ట్ 06: బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఆ సంస్థతో తాను చేసుకున్న కాంట్రాక్ట్‌తోపాటు వారి నుంచి లీగల్‌గా తీసుకున్న నగదు వివరాలన్ని (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఈడీ అధికారులకు అందజేసినట్లు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఈడీ అధికారుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ ముగిసిన అనంతరం హీరో విజయ్ దేవరకొండ విలేకర్లతో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యానని చెప్పారు. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అని రెండు రకాలు ఉంటాయని వివరించారు. తాను A23 అనే గేమింగ్ యాప్‌ కోసం పని చేసినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు.


బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి ఏ మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ లీగల్ అని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండ.. ఈ గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులతో పాటు రిజిస్ట్రేషన్స్ ఉంటాయన్నారు. దేశంలో గేమింగ్ యాప్స్ ఐపీఎల్, కబాడీ, వాలీ‌బాల్‌కి స్పాన్సర్ చేస్తున్నారని వివరించారు. అలాగే తన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈడీకి సమర్పించానన్నారు. ఇక తాను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలోనే ఓపెన్ కాదన్నారు. తాను లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేసినట్లు ఈడీ అధికారులకు వివరించానని ఆయన చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:28 PM