MLA Komatireddy Rajagopal Reddy: డీకే శివకుమార్‌తో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ..
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:56 PM
హైదరాబాద్ : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో.. ఇరువురు భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి, డీకే శివకుమార్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.
అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని తెలిపారు. కాంగ్రెస్‌లో తనని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని కుండబద్దలు కొట్టారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొన్నిరోజులుగా.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్, రాజగోపాల్ రెడ్డిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రేపు డీకే శివకుమార్, సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు