Share News

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:10 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్
KTR VS Congress

హైదరాబాద్ అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (JubileeHills By Election) కాంగ్రెస్‌ (Congress)కి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేసీఆర్‌ (KCR)ని తిట్టడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు ఓటు వేశారని.. ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకి మధ్య సయోధ్య లేక కొట్టుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు జాదు గాళ్లు అని దెప్పిపొడిచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హామీలిచ్చి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఓటు కోసం కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత పట్టించుకోరని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్‌ని అధికారంలోకి తెచ్చుకోవటానికి.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.


అన్ని మతాల వారిని, అన్నివర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆక్షేపించారు. మైనార్టీ సబ్ ప్లాన్ పెడతామన్నారని.. అది కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని సూచించారు. అవ్వా, తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్

గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 07:35 PM