Share News

KTR: తెలంగాణలో భారీ కుంభకోణం..రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 15 , 2025 | 03:04 PM

KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను రేవంత్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

KTR: తెలంగాణలో భారీ కుంభకోణం..రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR

హైదరాబాద్: రేవంత్ హయాంలో అధికారులు జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి దుష్ప్రవర్తనతో తెలంగాణ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు. హెచ్‌సీయూ భూమిని విక్రయించడానికి రూ.10వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. పచ్చదనాన్ని నాశనం చేయడానికి బుల్డోజర్లను మోహరించడం పర్యావరణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం అనాలోచిత చర్యలతో పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉందని అన్నారు. కంచ గచ్చిబౌలి అడవులను తప్పనిసరిగా రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు రేవంత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


సీఎం రేవంత్‌రెడ్డికి దేవుని పట్ల భక్తి లేదు: గొంగిడి సునీత

Gongidi-Sunitha.jpg

తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్‌లో గొంగిడి సునీత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మహిళలతో విశ్వ సుందరీమణుల కాళ్లు కడిగిస్తారా అని ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులతో కాళ్లు కడిగించి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారు. రుద్రమదేవి, సమ్మక్క, సారలమ్మ అస్తిత్వాన్ని రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసేలా చేసిందని గొంగిడి సునీత మండిపడ్డారు.


బతుకమ్మ చెప్పులతో ఆడిస్తారా అని గొంగిడి సునీత ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం చర్యలు చూస్తుంటే భస్మాసుర హస్తం గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి మనుషుల పట్ల గౌరవం లేదని... దేవుని పట్ల భక్తి లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి ఇంత అహంకారం ఎందుకని నిలదీశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఆలయాల్లోకి వెళ్తుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు మధ్య ఏం అవగాహన ఒప్పందం ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు ప్రభాకర్‌ రావు

KTR: అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:29 PM