Share News

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు ప్రభాకర్‌ రావు

ABN , Publish Date - May 15 , 2025 | 04:44 AM

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ రావు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు ప్రభాకర్‌ రావు

  • ముందస్తు బెయిల్‌ ఇస్తే అమెరికా నుంచి వస్తానని పిటిషన్‌

న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి) : సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ రావు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే, తాను భారతదేశానికి తిరిగివస్తానని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ నెల 2న బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.


హైకోర్టు తీర్పును ప్రభాకర్‌ రావు ఈ నెల 9న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తనపై ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, ఆరోగ్యం బాగోలేక చికిత్సకు అమెరికా వెళ్లానని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

Updated Date - May 15 , 2025 | 04:44 AM