Share News

Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ భేటీ

ABN , Publish Date - May 15 , 2025 | 04:33 AM

రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ భేటీ

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మొన్నటివరకు రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో సందీప్‌కుమార్ ఆశాఖలోనే ఒక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.


అయితే ఇటీవల రామకృష్ణారావు కొత్త సీఎ్‌సగా నియమితులైయ్యారు. దీంతో సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు పూర్తిస్థాయి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - May 15 , 2025 | 04:33 AM