KTR: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. రాహుల్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:35 PM
KTR: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రాహుల్‌గాంధీ కృషి చేశారని విమర్శించారు.

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాస్ సెటైర్లు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్‌కి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ ప్రభుత్వంపై ఫైర్
‘‘తొలి గండం దాటితే తొంభై ఏళ్ల ఆయుష్షు అని పెద్దల మాట. అల్లుని కంపెనీల కోసం అదానీ పరిశ్రమల కోసం అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం ఢిల్లీకి మూటల చేరవేత కోసం పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని, నెలలపాటు చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదు. పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు... పల్లెల్లో పేదల భూములు పల్లెల్లో గరీబోళ్ల ఇండ్లు పంటపొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల స్వైర విహారం... కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు.. తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలన. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి.. దినదిన గండంగా తెలంగాణం. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లాయే తెలంగాణ’’ అని కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
MP Anil: మూసీ పునర్జీవంపై పార్లమెంట్‌లో ప్రస్తావన..
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
Nalgonda Cat Fight: ఆ పిల్లి నాది.. కాదు నాది!
Read Latest Telangana News and Telugu News