Share News

Nalgonda Cat Fight: ఆ పిల్లి నాది.. కాదు నాది!

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:41 AM

కడకు పోలీసులదాకా వెళ్లిందీ పిల్లి పంచాయితీ! నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగుచూసిందీ ఘటన. పిల్లి యజమానులం అని చెప్పుకొంటున్న ఇద్దరిలో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం..

Nalgonda Cat Fight: ఆ పిల్లి నాది.. కాదు నాది!

గుర్తుపట్టకుండా ఉండేందుకు రంగేస్తారా? .. అసలు మేం రంగు వేయలేదంటే నమ్మరేం?

మార్జాలం కోసం ఇరుగుపొరుగు ఘర్షణ

తొలుత పోలీ్‌సస్టేషన్‌కు.. ఆపై ఎస్పీ దాకా పంచాయితీ

నల్లగొండలో ఘటన.. రంగు అద్దారా? లేదా? అనేదే కీలకం

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పిల్లి వెంట్రుకలు

నల్లగొండ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తెల్ల బొచ్చుతో ముద్దుగా ఉందా పిల్లి! ఆ జీవి నాది.. అంటే నాది అంటూ ఇరుగుపొరుగు తగవులాడుకున్నారు. కడకు పోలీసులదాకా వెళ్లిందీ పిల్లి పంచాయితీ! నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగుచూసిందీ ఘటన. పిల్లి యజమానులం అని చెప్పుకొంటున్న ఇద్దరిలో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండలోని రెహమత్‌నగర్‌కు చెందిన పుష్పలత మూడేళ్ల క్రితం నెల వయసున్న పిల్లిని తెచ్చుకొని షఫీ అని పేరు పెట్టుకొని పెంచుకుంటోంది. నిరుడు జూన్‌లో ఆ పిల్లి కనిపించకుండా పోయింది. గత నెల 2న తన ఇంటి పరిసరాల్లోనే పిల్లి కనిపించడంతో పట్టుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ ఇంటి సమీపంలోనే ఉండే అష్రాఫ్‌, ఆ పిల్లి తమది అని.. తాము పెంచుకుంటున్న పిల్లిని ఎలా తీసుకెళతారని ఆమెను ప్రశ్నించాడు. పిల్లి తనదేనని.. గుర్తుపట్టకుండా రంగులేశారని ఆమె ఆరోపించింది. ‘‘నా పిల్లి ఎలా ఉంటుందో నాకు తెలుసు. పిల్లిని ఎత్తుకెళ్లడమే కాకుండా రంగువేసి మోసం చేస్తారా? దానికి స్నానం చేయిస్తే ఆ రంగంతా పోయింది’’ అని పుష్పలత వ్యాఖ్యానించింది.


దీనికి అతడు.. తాము పిల్లికి రంగు వేయలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటనపై పుష్పలత ఈనెల 15న నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తర్వాత అక్కడి పోలీసు లు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గురువారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసింది. పిల్లి పంచాయితీ తేల్చాలంటూ ఆయన ఆదేశించడంతో పోలీసులు కదిలారు. పుష్పలతను, అష్రా్‌ఫను స్టేషన్‌కు పిలిపించారు. పంచాయితీ తెగకపోవడంతో అసలు యజమాని ఎవరో తేల్చేందుకు ఆ పిల్లి వెంట్రుకల ను హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. ఆ వెంట్రుకల ద్వారా ఎలా తేలుస్తారు? అనంటే.. పిల్లికి రంగు వేశారని పుష్పలత.. రంగు వేయలేదని అష్రాప్‌ చెబుతున్నారు కదా! రంగు వేశారా.. లేదా? అనేది పిల్లి వెంట్రుకలకు నిర్వహించనున్న పరీక్ష ద్వారా తేలనుంది. ఆ తర్వా త పిల్లి అసలు యజమాని ఎవరో తేలిపోనుంది!


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:41 AM