MP Anil: మూసీ పునర్జీవంపై పార్లమెంట్‌లో ప్రస్తావన..
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:55 AM
మూసీనది పునర్జీవంపై రాజ్యసభ సభ్యులు అనీల్‌కుమార్ యాదవ్(Anil Kumar Yadav) పార్లమెంట్‌లో ప్రస్తావించారు. శుక్రవారం జీరో అవర్‌లో మాట్లాడిన అనీల్‌కుమార్ యాదవ్.. మూసీనదిని జాతీయ నదీ పునర్జీవం పథకంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- ‘జాతీయ నదీ పునర్జీవం’లో చేర్చాలని ఎంపీ అనీల్ డిమాండ్
హైదరాబాద్ సిటీ: మూసీనది పునర్జీవంపై రాజ్యసభ సభ్యులు అనీల్‌కుమార్ యాదవ్(Anil Kumar Yadav) పార్లమెంట్‌లో ప్రస్తావించారు. శుక్రవారం జీరో అవర్‌లో మాట్లాడిన అనీల్‌కుమార్ యాదవ్.. మూసీనదిని జాతీయ నదీ పునర్జీవం పథకంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్(Hyderabad)లోనే పుట్టి పెరిగిన ఆయన పార్లమెంట్‌లో మాట్లాడేందుకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మూసీ విశిష్టతను, పునర్జీవం ఆవశ్యకతలను వివరించే ప్రయత్నం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
మూసీనదికి గొప్ప చరిత్ర ఉందని, ఒకనాడు హైదరాబాద్ తాగునీటికి, వ్యవసాయానికి దోహదపడిన మూసీనది ప్రస్తుతం పూర్తిగా కలుషితమై మురుగు నాలాగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నగర విస్తరణలో పలు కంపెనీల కాలుష్య వ్యర్థాలు, సీవరేజ్ వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయని, దీని పరివాహక ప్రాంతాల్లో జీవనోపాధి దెబ్బతిన్నదని వివరించారు. మూసీనదికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం తగిన నిధులిచ్చి సహకరించాలని డిమాండ్ చేశారు. మూసీనది పునర్జీవంతో నగరవాసులకు, రైతులకు, గంగపుత్రులకు జీవనోపాధి మెరుగవుతుందని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News