Share News

KTR Key Meeting With KCR: కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:53 AM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్‌ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు.

KTR Key Meeting With KCR: కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు
Kavitha Controversy

హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే (Erravalli Farmhouse) ఉన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (KCR) కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కాళేశ్వరంపై (Kaleshwaram) సీబీఐ విచారణ (CBI Investigation), కవిత ఎపీసోడ్‌పై ఇద్దరు నేతలు సమాలోచనలు చేస్తున్నారు.


కవిత ఆరోపణలపై ఇప్పటివరకూ కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత ఆరోపణలకు ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్లు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు యూకే పర్యటనలో హరీష్‌రావు ఉన్నారు. యూకే పర్యటన ముగించుకొని ఎల్లుండి(శనివారం) ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇంకోవైపు బంజారాహిల్స్ నివాసంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారు. తన కుమారుడు పుట్టినరోజు రేపు(శుక్రవారం) ఉండటంతో ఇవాళ(గురువారం), రేపు(శుక్రవారం) తన కుటుంబంతోనే ఉండాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 01:03 PM