Cyclone Montha in Telangana: మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:11 PM
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని తెలిపారు. మొంథా తుపాను కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృతం అయిందని చెప్పుకొచ్చారు. రేపు(మంగళవారం) ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశలో కదిలి తీవ్ర తుపానుగా మారనుందని పేర్కొన్నారు.
ఈ తీవ్ర తుపాను మంగళవారం రాత్రి, లేదా ఎల్లుండి(బుధవారం) ఉదయంలోగా మచిలీపట్నం, కళింగపట్నం ఇంచుమించు.. కోస్తా ఆంధ్రప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో ఈరోజు(సోమవారం) నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
మంగళవారం, బుధవారం భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వివరించారు. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు. మంగళవారం 19 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు.
బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉంటుందని తెలిపారు. తుపాను దృష్ట్యా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని ప్రకటించారు. అలాగే, ఎల్లుండి బుధవారం నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్
మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News