Share News

Raja Singh Congratulates ON TTD: టీటీడీకి ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:14 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.

Raja Singh Congratulates ON TTD: టీటీడీకి ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు
Raja Singh Congratulates ON TTD

హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) అభినందనలు తెలిపారు. తిరుపతి దేవస్థానంలోకి ఎవరైనా వేరే మతానికి చెందిన వారు టోపీ ధరించి మతప్రచారం చేయడానికి వస్తే, వారిపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారని... ఇది మంచి నియమమని ఉద్ఘాటించారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.


అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) శ్రీశైల దేవస్థాన (Srisailam Temple) రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. వారిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ నిర్లక్ష్యంతో భవిష్యత్తులో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని చెప్పుకొచ్చారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతం అపవిత్రం చేయకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాజాసింగ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్‌, హరీష్ రావుకి బిగ్ రిలీఫ్..

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 12:48 PM