Telangana Govt Issues Compensation Orders: భారీ వర్షాలు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:57 AM
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలకు (Heavy Rains) నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్(Telangana Government) చర్యలు చేపట్టింది. ఈ మేరకు బాధితులకు పరిహారం కింద రూ.1.30 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన పశువులు, మనుషుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు విడుదల చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్.
ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎక్కువగా పశువులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.4 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. ఒక మేక లేదా ఒక గొర్రె మాత్రమే చనిపోతే వాటికి రూ.5,000లు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. కామారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబ్‌నగర్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు ఈ ఎక్స్‌గ్రేషియా వర్తించనుంది. ఈ మేరకు ఆయా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు
Read latest Telangana News And Telugu News