Share News

High Court Hearing on KCR And Harish Rao Petitions: కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్‌, హరీష్ రావుకి బిగ్ రిలీఫ్..

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:10 AM

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు.

High Court Hearing on KCR And Harish Rao Petitions: కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్‌, హరీష్ రావుకి బిగ్ రిలీఫ్..
High Court Hearing on KCR And Harish Rao Petitions

హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఇవాళ (మంగళవారం) విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు. న్యాయస్థానంలో వారు వేసిన పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.


కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తర్వాత కేసీఆర్, హరీష్‌రావులపై చర్యలు ఉంటాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కాగా, తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్ల విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉమ్మడి ఖమ్మంలో కుండపోత వర్షం

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 11:42 AM