Train Viral Video: ఫ్లాట్‌పామ్‌పై యువకుడి రీల్స్.. రైలు డ్రైవర్ ఎలా షాకిచ్చాడో చూస్తే..
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:01 PM
ఓ యువకుడు రైల్వే ఫ్లాట్‌పామ్‌పై నిలబడి రీల్స్ చేస్తున్నాడు. రైలు వచ్చే ముందు.. ఫ్లాట్‌పామ్ చివరన నిలబడి వీడియో తీసుకుంటున్నాడు. రైలు సమీపానికి వచ్చిందని తెలిసినా.. స్టైల్‌గా జట్టు సరి చేసుకుంటూ వీడియోలను ఫోజులు ఇస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
రైల్వే ప్లాట్‌ఫామ్స్, రైలు పట్టాలు, కదులుతున్న రైళ్లో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం సర్వసాధారణమైంది. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకరంగా రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు రైలు డ్రైవర్.. ఇంజిన్ నుంచి దిగి వచ్చి బుద్ధి చెప్పిన సందర్భాలను చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్వే ఫ్లాట్‌పామ్‌పై ప్రమాదకరంగా నిలబడి రీల్స్ చేస్తున్నాడు. ఇది గమనించిన రైలు డ్రైవర్ ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైల్వే ఫ్లాట్‌పామ్‌పై నిలబడి (Man doing reels on Railway platform) రీల్స్ చేస్తున్నాడు. రైలు వచ్చే ముందు.. ఫ్లాట్‌పామ్ చివరన నిలబడి వీడియో తీసుకుంటున్నాడు. రైలు సమీపానికి వచ్చిందని తెలిసినా.. స్టైల్‌గా జట్టు సరి చేసుకుంటూ వీడియోలను ఫోజులు ఇస్తున్నాడు.
ఇదంతా గమనిస్తున్న రైలు డ్రైవర్ దగ్గరికి రాగానే.. తన చేతిలోని జెండా కర్రతో (Train driver hits man with flagstick) ఆ యువకుడి తలపై కొట్టి హెచ్చరించాడు. రైలు డ్రైవర్ చేసిన పనికి ఆ యువకుడు షాక్ అయి.. చివరకు తన తప్పు తెలుసుకుని దూరంగా వెళ్లిపోయాడు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యువకుడికి.. రైలు డ్రైవర్ షాకిచ్చాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారిని మరింత గట్టిగా కొట్టాలి’.. అంటూ కొందరు, ‘రైలు డ్రైవర్ చాలా మంచి పని చేశారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 వేలకు పైగా లైక్‌లు, 8.38 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి