Train Viral Video: బాత్రూంనే బుక్ చేసుకున్నాడుగా.. రైల్లో ఇతనేం చేశాడో చూడండి..
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:02 AM
ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైల్లో ప్రయాణించడంలో వింతేముందీ.. అని అనుకుంటున్నారా. రైల్లో ప్రయాణించడంలో వింతేమీ లేకున్నా.. అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు రైలు ప్రయాణించే సమయంలో చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తే.. మరికొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు సీట్ల కోసం అంతా అవాక్కయ్యే స్టంట్స్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్లో ప్రయాణం చేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. బాత్రూంనే బుక్ చేసుకున్నాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైల్లో ప్రయాణించడంలో వింతేముందీ.. అని అనుకుంటున్నారా. రైల్లో ప్రయాణించడంలో వింతేమీ లేకున్నా.. అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన ఇంట్లోని సామాన్లతో రైలు ఎక్కాడు. పరుపులు, మంచాలు తదితరాలతో బోగీలోకి ఎక్కిన అతడు.. లోపల సీట్లు లేకపోవడంతో నిలబడాల్సి వచ్చింది.
అయితే ఎలాగైనా సీటు సంపాదించాలని ఆలోచించిన అతడికి.. చివరికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన సామాన్లంటిన్నీ బోగీలోని బాత్‌రూంలో (train bathroom) కుక్కేశాడు. బాత్రూంలో పరుపులను వేసి, వాటిపై కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా అతడిద వద్ద ఉన్న మడత మంచాన్ని బాత్రూం కిటికీకి బయట వేలాడదీశాడు. ఇలా అతను బాత్రూం మొత్తాన్ని కబ్జా చేసేశాడు. ఇతడి నిర్వాకం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కొందరు అతడి వద్దకు వెళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రైలు బాత్రూంను బెడ్‌రూమ్‌గా మార్చేశాడుగా’.. అంటూ కొందరు, ‘రద్దీ సమయాల్లో అదనపు రైళ్లు నడపకుంటే ఇలాగే అవుతుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి