Jugad Viral Video: ప్లాస్టిక్ పైపులను తయారు చేసింది ఇందుకా.. బాత్‌రూంలో ఇతను చేసిన నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:51 AM
చాలా మంది ఇంట్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. కూలర్‌ను కూరగాయల స్టోర్‌గా మార్చడం, గ్యాస్ స్టవ్‌ను బాత్‌రూం షవర్‌గా మార్చడం, ల్యాప్‌టాప్‌తో పూరీలు చేయడం వంటి వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా..
వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే వీరిని చూసి కొందరు మరింత కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఏవేవో వింత వింత ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇంట్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. కూలర్‌ను కూరగాయల స్టోర్‌గా మార్చడం, గ్యాస్ స్టవ్‌ను బాత్‌రూం షవర్‌గా మార్చడం, ల్యాప్‌టాప్‌తో పూరీలు చేయడం వంటి వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్లాస్టిక్ పైపులతో ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ప్లాస్టిక్ పైపులు తయారు చేసింది ఇందుకా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్లాస్టిక్ పైపులతో విచిత్ర ప్రయోగం చేశాడు. చాలా మంది బాత్రూం షవర్లను (Bathroom shower) వింత వింతగా చేయడం చూస్తుంటాం. గతంలో ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్ నాజిల్‌ను షవర్‌గా మార్చడాన్ని చూశాం. అయితే ఈ వ్యక్తి ప్లాస్టిక్ పైపులను షవర్‌గా ఎందుకు మార్చకూడదూ.. అని ఆలోచించాడు. ఆలోచించిందే తడవుగా ఆచరణలో పెట్టేశాడు. ఇందుకోసం కొన్ని పైపులను తీసుకున్నాడు.
ఓ వైపు చివరన త్రికోణంలో పైపులను ఏర్పాటు చేసి, వాటికి కింది వైపు రంధ్రాలు చేశాడు. ఆ పైపు మరో చివరను కింద ఉన్న కుళాయికి జాయింట్ చేశాడు. ఫైనల్‌గా కుళాయి ఆన్ చేయడంతో నీళ్లు పైపు చివర (Bathroom shower with plastic pipes) నుంచి షవర్‌లా కిందకు దూకుతున్నాయి. పైపులను త్రికోణం ఆకారంలో ఏర్పాటు చేయడం వల్ల నీళ్లు కూడా వెడల్పుగా చిమ్ముతూ చూపరులను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది’.. అంటూ కొందరు, ‘షవర్ కంపెనీ వాళ్లు చూస్తే షాకవుతారేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 6.17 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి