Deer Viral Video: మొసలికి చిక్కిన జింక.. దాడి చేసేందుకు వచ్చిన హైనా.. చివరికి సినిమా ట్విస్ట్..
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:39 PM
ఓ పెద్ద మొసలి నీటి కుంటలో దాక్కుని వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో కొన్ని జింకలు అక్కడికి నీళ్లు తాగేందుకు వచ్చాయి. తీరా నీళ్లు తాగే సమయంలో మొసలి.. ఒక్కసారిగా లోపలి నుంచి పైకి లేచి జింకలపై దాడి చేస్తుంది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పులులు, సింహాలు, మొసళ్ల దాడి నుంచి కొన్ని జంతువులు విచిత్రంగా ప్రాణాలతో బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు అవి ప్రాణాలతో బయటపడే సీన్ చూస్తే.. అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇంకొన్నిసార్లు వీటి మధ్య సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జింక మొసలి నోటికి చిక్కింది. అదే సమయంలో ఓ హైనా కూడా దాన్ని వేటాడేందుకు వెళ్లింది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి నీటి కుంటలో దాక్కుని వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో కొన్ని జింకలు అక్కడికి నీళ్లు తాగేందుకు వచ్చాయి. తీరా నీళ్లు తాగే సమయంలో మొసలి.. ఒక్కసారిగా లోపలి నుంచి (Crocodile attacks deer) పైకి లేచి జింకలపై దాడి చేస్తుంది. చివరకు ఓ జింకు పట్టేసుకుంటుంది. మొసలి బారి నుంచి బయటపడేందుకు ఆ జింక శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా దాని వల్ల సాధ్యం కాదు. ఈ క్రమంలో ఓ హైనా అక్కడికి వస్తుంది.
హైనాను చూడగానే అక్కడున్న మిగతా జింకలన్నీ పారిపోతాయి. చివరకు మొసలికి చిక్కిన జింకపైనే హైనా కూడా కన్నేస్తుంది. దాన్ని ఎలాగైనా (Hyena tries to attack deer) తినేయాలని దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్లి.. అటూ, ఇటూ తిరిగి జింకను భయపెడుతుంది. దీంతో మొసలి జింకను వదిలేస్తుంది. మొసలి వదిలేయగానే.. జింకకు ప్రాణం లేచొస్తుంది. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగందుకుంటుంది. అయితే హైనా కూడా జింకను వెంటపడుతూ వెనుకే వెళ్తుంది. అయితే సీన్ చూస్తుంటే .. ఈ ఘటనలో జింక హైనా (Deer escapes from hyena) నుంచి కూడా తప్పించుకున్నట్లు కనిపిస్తోంది.
ఇలా ఆ జింకకు శత్రువు వల్లే మంచి జరిగిందన్నమాట. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘జింక టైం ఎంతో బాగుంది’.. అంటూ కొందరు, ‘జింకకు మేలు చేసిన హైనా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3300కి పైగా లైక్‌లు, 9.39 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి