Women Stunts Viral Video: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. రెండు గోడల మధ్య..
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:14 AM
ఓ యువతి రెండు గోడల మధ్య నిలబడి ఉంది. కెమెరా ఆన్ చేయగానే పరుగెత్తుకుంటూ వెళ్లి.. రెండు గోడలపై అటూ, ఇటూ రెండు కాళ్లను ఉంచి మెల్లిగా పైకి ఎగబాకుతూ వెళ్తుంది. ఇలా చూస్తుండగానే గోడల పైకి సునాయాసంగా ఎక్కేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు..
ప్రస్తుతం చాలా మంది మహిళలు పురుషులతో పోటీపడి మరీ పని చేస్తున్నారు. కొందరైతే మగవారు కూడా చేయలేని స్టంట్స్‌ను సునాయాసంగా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు చేసే స్టంట్స్ చూస్తే.. ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రెండు గోడల మధ్య చేసిన వినూత్న స్టంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రెండు గోడల మధ్య నిలబడి ఉంది. కెమెరా ఆన్ చేయగానే పరుగెత్తుకుంటూ వెళ్లి.. రెండు గోడలపై అటూ, ఇటూ రెండు కాళ్లను ఉంచి మెల్లిగా పైకి ఎగబాకుతూ వెళ్తుంది. ఇలా చూస్తుండగానే గోడల పైకి సునాయాసంగా ఎక్కేస్తుంది.
ఈ క్రమంలో ఏమాత్రం స్లిప్ అయినా ధబేల్‌మని కిందపడే ప్రమాదం ఉంటుంది. కానీ ఈమె మాత్రం ఎక్కడా తడబడకుండా గోడల పైకి సునాయాసంగా ఎక్కేసింది. ఈమె చేసిన వినూత్నమైన స్టంట్ (Young Women Stunts Between Two Walls) అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
‘ఈమె స్పైడర్ ఉమన్‌లా ఉందే’.., ‘కోతిలా విచిత్రమైన స్టంట్స్ చేస్తుందే’.., ‘గ్రేట్ స్టంట్.. వెరీ నైస్’.., ‘ఇండియన్ స్పైడర్ ఉమన్’.., ‘ఇండియాలో ఇలాంటి అద్భుతాలకు కొదవే లేదు’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 89 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి