Diwali Jugaad Video: ఇదెక్కడి దీపావళిరా నాయనా.. ఫ్యాన్‌ను కూడా వదల్లేదుగా..
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:01 PM
దీపావళి సందర్భంగా ఓ వ్యక్తి తన ఇంటి ముందు టపాసులు కాల్చాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అంతా చేసే పని అదేగా.. అనేదేగా మీ సందేహం. ఇతను టపాసులు కాల్చడంలో విచిత్రమేమీ లేకున్నా.. కాల్చిన విధానమే.. ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. సాధారణంగా..
దీపావళి పండుగ ముగిసినా అందుకు సంబంధించిన వీడియోలు మాత్రం.. ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వింత వింతగా పేలే టపాసులు, వాటిని వినూత్నంగా పేల్చడం వంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టపాసులు పేల్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. చిచ్చుబుడ్లను ఇలాక్కూడా పేల్చవచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దీపావళి (Diwali) సందర్భంగా ఓ వ్యక్తి తన ఇంటి ముందు టపాసులు కాల్చాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అంతా చేసే పని అదేగా.. అనేదేగా మీ సందేహం. ఇతను టపాసులు కాల్చడంలో విచిత్రమేమీ లేకున్నా.. కాల్చిన విధానమే.. ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. సాధారణంగా ఎవరైనా చిచ్చుబుడ్లను నేలపై పెట్టి కాల్చుతారు. దీంతో వాటి నుంచి నిప్పు రవ్వులు మిరమిట్లు కొలుపుతూ గాల్లోకి నీటి ఫౌంటెన్‌లా విరజిమ్ముతాయి.
అయితే ఈ వ్యక్తి చిచ్చుబుడ్లను వినూత్నంగా కాల్చాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం అతను సీలింగ్ ఫ్యాన్ తీసుకుని, దాన్ని ఓ బకెట్‌లో ఇసుక పోసి.. అందులో తలకిందులుగా పెట్టాడు. తర్వాత ఫ్యాన్ రెక్కలపై చిచ్చుబడ్లను పెట్టి, (Man Sets Fire to Chichubuddi on ceiling fan) అవి కిందపడకుండా టేప్ అంటించాడు. చివరగా ఆ మూడు చిచ్చుబుడ్లకు నిప్పు పెట్టగా.. అవి నిప్పులు చిప్పుతూ ఫ్యాన్‌ను కూడా గిరగిరా తిప్పేశాయి. ఇలా చాలా సేపు చిచ్చు బుడ్లు నిప్పులను విరజిమ్ముతూ ఫ్యాన్‌ను గిరగిరా తిప్పేశాయి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సీలింగ్ ఫ్యాన్‌పై చిచ్చుబుడ్లు.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3900కి పైగా లైక్‌లు, 5.13 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి