Share News

Washing Machine Viral Video: వాషింగ్ మిషిన్ వాడేది ఇందుకా.. కంపెనీ వాళ్లు చూస్తే ఖంగుతింటారుగా..

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:25 AM

వాషింగ్ మిషిన్‌ను దేనికోసం వాడతారు.. అని అడిగితే.. ఇదేం పిచ్చి ప్రశ్న.. వాషింగ్ మిషిన్‌ను బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికోసం వాడతాం.. అని అంటారు కదా. ఇతను కూడా వాషింగ్ మిషిన్‌ను వాడుతున్నాడు.

Washing Machine Viral Video: వాషింగ్ మిషిన్ వాడేది ఇందుకా.. కంపెనీ వాళ్లు చూస్తే ఖంగుతింటారుగా..

ఇంట్లోని వస్తువులను చిత్రవిచిత్రంగా వాడేవారిని చూస్తుంటాం. వంట చేయాల్సిన కుక్కర్‌తో బట్టలు ఇస్త్రీ చేయడం, ఇస్త్రీ చేయాల్సిన ఐరన్ బాక్స్‌పై కాఫీ వేడి చేయడం, ప్లాస్టిక్ పైపులతో బాత్‌రూం షవర్ తయారు చేయడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వాషింగ్ మిషిన్ వాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘వాషింగ్ మిషిన్ వాడేది ఇందుకా..’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాషింగ్ మిషిన్‌ను దేనికోసం వాడతారు.. అని అడిగితే.. ఇదేం పిచ్చి ప్రశ్న.. వాషింగ్ మిషిన్‌ను బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికోసం వాడతాం.. అని అంటారు కదా. ఇతను కూడా వాషింగ్ మిషిన్‌ను వాడుతున్నాడు. అయితే అందరిలా కాకుండా వినూత్నంగా వాడేశాడు.


వాషింగ్ మిషిన్‌లో బట్టలు కాకుండా (Man Cleaning Peanuts in Washing Machine) వేరుశెనక కాయలను వేసేశాడు. బకెట్‌ నీటిలో వేరుశెనగ కాయలను కడగాల్సింది పోయి.. వాషింగ్ మిషిన్‌లో వేశాడు. తర్వాత అందులో నీళ్లు పోసి, మిషిన్ ఆన్ చేశాడు. మిషిన్ గిరగిరా తిరగడం ద్వారా వేరుశెనగ కాయలు మొత్తం శుభ్రంగా మారిపోయాయి. ఇలా చేతులకు శ్రమ లేకుండా వేరుశెనగ కాయలను కడిగేశాడన్నమాట. ఇతడి వింత ఆలోచనను చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాషింగ్ మిషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 44 వేలకు పైగా లైక్‌లు, 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 25 , 2025 | 09:25 AM