Tiger Viral Video: అయ్యో.. పెద్ద కష్టమే వచ్చిందిగా.. రాత్రి వేళ పులి ఏం చేస్తుందో చూస్తే..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:13 PM
ఓ పులి రాత్రి వేళ అడవిలో ఆహారం తింటోంది. అటుగా వెళ్లిన ఫొటోగ్రాఫర్‌కు ఈ దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అంతా పులి మాంసం తింటుందేమో అని అనుకున్నారు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది.
పులి అంటేనే మెరుపుదాడికి మరో పేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక్కసారి వేట కోసం కాలు దువ్విందంటే.. ఎంత పెద్ద జంతువైనా దానికి ఆహారమైపోవాల్సిందే. అలాంటి పులి కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అప్పుడప్పుడూ పులి మాంసానికి బదులు గడ్డి తినడం, మరికొన్నిసార్లు నీళ్లలోని చెత్తాచెదారాన్ని బయటపడేయడాన్ని చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి రాత్రి వేళ అడవిలో చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అయ్యో పులికి ఎంత దుస్థితి వచ్చిందీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పులి రాత్రి వేళ అడవిలో ఆహారం తింటోంది. అటుగా వెళ్లిన ఫొటోగ్రాఫర్‌కు ఈ దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అంతా పులి మాంసం తింటుందేమో అని అనుకున్నారు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. ప్లాస్టిక్, మట్టితో నిండిన చెత్త కుప్పలో పులి.. పంది తరహాలో ఆహారం కోసం వెతుకుతోంది. వెతికి వెతికి మరీ నోటికి చిక్కిన దాన్ని నమిలేస్తోంది.
ఇలా ఆ పులి చాలా సేపు అక్కడే ఉండి.. (Tiger Eating Garbage) చెత్తలో ఆహారం వెతుక్కుంటోంది. పులి ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా ఉండే ఈ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. అయ్యో.. ఈ పులికి ఎంత కష్ట వచ్చిందో.. అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. అడవిని కూడా వదలకుండా చెత్తాచెదారం డంప్ చేయడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చెత్తాచెదారం వేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు’.. అంటూ కొందరు, ‘మనం ఆఖరికి అడవులను కూడా పాడు చేస్తున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4500కి పైగా లైక్‌లు, 2.27 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి