Old Women Funny Video: పానీపూరీ వ్యాపారికి షాకిచ్చిన వృద్ధురాలు.. ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:01 PM
ఓ పానీపూరీ విక్రేత (Panipuri seller) వద్ద చాలా మంది యువతీయువకులు నిలబడి పానీపూరీ తింటున్నారు. ఇంతలో అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చింది. తనకూ పానీపూరీ ఇవ్వాలని వ్యాపారికి చెప్పింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
పానీపూరీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పానీపూరీ తిననిదే రోజు గడవని పరిస్థితి ఉండదు. అయితే పానీపూరీలు తినే సమయంలో చాలా మంది వేగంగా తినడంలో ఇబ్బంది పడుతుంటారు. ప్లేటులోని పానీపూరీలను ఒక్కొక్కటిగా మెల్లి మెల్లిగా తింటూ ఆ రుచుని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వృద్ధురాలు పానీపూరీ విక్రేతకు షాక్ ఇచ్చింది. ఆమె పానీపూరీలు తినే విధానం చూసి పక్కన ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పానీపూరీ విక్రేత (Panipuri seller) వద్ద చాలా మంది యువతీయువకులు నిలబడి పానీపూరీ తింటున్నారు. ఇంతలో అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చింది. తనకూ పానీపూరీ ఇవ్వాలని వ్యాపారికి చెప్పింది. దీంతో అతన ఆమె చేతిలో ఓ ప్లేటు పెట్టి, ఒక్కొక్కటిగా పానీపూరీలు పెట్టడం స్టార్ట్ చేశాడు. వృద్ధురాలు కావడంతో ఒకటి తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చి రెండో పానీపూరీ పెడదాం అనుకున్నాడు.
అయితే అతను పానీపూరీని ప్లేటులో పెట్టీపెట్టకముందే.. దాన్ని చటుక్కున నోట్లో వేసుకుని తినేసింది. ఇలా వేసిన (old woman ate panipuri fast) పానీపూరీని వేసినట్లుగా మాయం చేసేసింది. వృద్ధురాలి నిర్వాకం చూసి ఆ వ్యాపారితో పాటూ అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ బామ్మ.. పానీపూరీ లవర్‌లా ఉందే’.. అంటూ కొందరు, ‘ఈ బామ్మ టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి