Biker Jugaad Video: టీవీని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ బైకర్ అతి తెలివి చూస్తే..
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:36 AM
ఓ వ్యక్తి బైక్ డ్రైవింగ్‌కు సిద్ధమైన సమయంలో హెల్మెట్ కనిపించలేదు. దీంతో చివరకు వివిధ రకాలుగా ఆలోచించాడు. ఈ క్రమంలో పాత టీవీ చూడగానే అతడి బుర్రలో బల్బు వెలిగింది. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
కొందరి ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొందరి ప్రయోగాలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇంకొందరి ప్రయోగాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వింత వింత, విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైక్ రైడింగ్ సమయంలో చేసిన వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. టీవీని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైక్ డ్రైవింగ్‌కు సిద్ధమైన సమయంలో హెల్మెట్ కనిపించలేదు. దీంతో చివరకు వివిధ రకాలుగా ఆలోచించాడు. ఈ క్రమంలో పాత టీవీ చూడగానే అతడి బుర్రలో బల్బు వెలిగింది. ఆ పాత టీవీనే హెల్మెట్‌లాగా ఎందుకు వాడకూడదూ అని ఫిక్స్ అయ్యాడు.
ఇంకేముందీ.. ఆ టీవీ లోపల పార్ట్స్ తీసేశాడు. ఇలా మొత్తం తీసేసిన తర్వాత (Biker wears TV as helmet on his head) టీవీని సిద్ధం చేసేశాడు. చివరగా బైక్ స్టార్ట్ చేసి, టీవీని తలకు తగిలించేసి.. ఎంచక్కా దూసుకెళ్లిపోయాడు. హెల్మెట్‌కు బదులుగా ఇలా టీవీని తలకు తగిలించుకోవడం చూసి అంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి