Viral Video: ఏసీ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని తెరచి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:59 PM
ఓ వ్యక్తి చాలా కాలం తర్వాత ఏసీని ఆన్ చేయగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో ఏంటా అని తెరచి చూడగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ప్రస్తుతం ఎండలు పెరిగిపోవడంతో ప్రజలు తమ ఇళ్లలో కూలర్లు, ఏసీలకు పని పెడుతున్నారు. కొందరు కొత్తవి తీసుకుంటుండగా.. మరికొందరు పాత వాటికి మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే కొన్ని నెలలుగా ఏసీ, కూలర్లను ఆన్ చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. ఇలాగే ఓ వ్యక్తి చాలా కాలం తర్వాత ఏసీని ఆన్ చేయగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో ఏంటా అని తెరచి చూడగా.. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏపీ విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తన ఇంట్లోని ఏసీని కొన్ని నెలలుగా ఉపయోగించలేదు. ఇటీవల ఎండలు పెరిగిపోవడంతో ఏసీని ఆన్ చేశాడు.
Train Bird Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే.. రైల్లో ఇతడి నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..
అయితే అందులో నుంచి వింత వింత శబ్ధాలు రావడం మొదలెట్టాయి. దీంతో అనుమానం వచ్చి లోపల చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. ఏసీలో విచిత్రంగా పాము తన పిల్లలతో (Snakes in the AC) కనిపించింది. పాములను చూసి భయపడ్డ అతను.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న అతను.. వాటిని ఎంతో చాకచక్యంగా బయటికి తీశాడు. ఏసీలోనే గుడ్లు పెట్టిన పాము.. చివరకు దాన్నే తన అడ్డగా మార్చుకుందన్నమాట.
Smart Bird Video: ఈ పక్షికి సాటి మరేదీ లేదనుకుంటా.. రంగులను ఎలా సెట్ చేస్తోందంటే..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అవి పాములు అనుకున్నావా.. నూడుల్స్ అనుకున్నావా.. అలా పట్టుకున్నావేందీ బ్రో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 96 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..