Train Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే.. రైల్లో ఇతడి నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:22 PM
రైల్లో ఓ వ్యక్తి చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన లగేజీని హుక్‌కు తగిలించాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. లగేజీ అయితే తగిలించాడుగా గానీ.. తీరా దాన్ని తీసుకునే క్రమంలో వింత నిర్వాకానికి పాల్పడ్డాడు..

రైలు ప్రయాణాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారిని చూస్తుంటాం. కొందరు సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సీటును తమకు తామే సృష్టించుకుంటుంటారు. ఇంకొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్లో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో (Train) ఓ వ్యక్తి చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన లగేజీని హుక్‌కు తగిలించాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. లగేజీ అయితే తగిలించాడుగా గానీ.. తీరా దాన్ని తీసుకునే క్రమంలో వింత నిర్వాకానికి పాల్పడ్డాడు.
Smart Bird Video: ఈ పక్షికి సాటి మరేదీ లేదనుకుంటా.. రంగులను ఎలా సెట్ చేస్తోందంటే..
లగేజీతో పాటూ హుక్‌లను (Luggage hook theft) కూడా తీసుకున్నాడు. హుక్‌కు ఉన్న స్క్రూలను ఓ ఇనుప రేకుతో సాయంతో ఊడదీశాడు. ఇలా చివరకు ఆ హుక్‌ను మొత్తం ఊడదీసి, చేతిలోకి తీసుకున్నాడు. పైగా తానేదే ఘనకార్యం చేసినట్లుగా కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఇలా ఇనుప హుక్‌లను చోరీ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Rottweiler vs Cobra: కోబ్రాను పసిగట్టిన రోట్‌వెల్లర్.. చివరికి జరిగింది చూస్తే దడ పుట్టాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇందుకే గ్లాసులకు గొలుసులు కట్టేది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి కక్కుర్తిని ఎక్కడా చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2900కి పైగా లైక్‌లు, 68 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..