Smart Bird Video: ఈ పక్షికి సాటి మరేదీ లేదనుకుంటా.. రంగులను ఎలా సెట్ చేస్తోందంటే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:48 PM
ఓ పక్షికి వింత పరీక్ష పెట్టగా దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పక్షికి ఓ వైపు చిన్న సైజులో ఉండే రంగు రంగుల ప్లాస్టిక్ బుట్టలను ఉంచారు. అలాగే ఇంకోవైపు ఆ రంగులకు మ్యాచ్ అయ్యేలా రంగు రంగు పూలను కూడా ఏర్పాటు చేశారు. చివరకు పక్షి ఏం చేసిందో చూడండి..

కొన్ని పక్షులు తెలివిగా చేసే పనులు చూస్తే ముచ్చటేస్తుంటుంది. పంజరంలోని రామ చిలుక బయటికి వచ్చి జాతకం తెలియజేసే కార్డులను బయటికి తీయడం చూస్తుంటాం. అలాగే పిల్లలను చూసి అచ్చం వారిలా ప్రవర్తిస్తూ డాన్స్ చేసే పక్షులను కూడా చూశాం. ఇలాంటి విచిత్రమైన పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ తెలివైన పక్షికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పక్షి రంగులను సెట్ చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పక్షికి సాటి మరేటీ లేదనుకుంటా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పక్షికి వింత పరీక్ష పెట్టగా దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పక్షికి ఓ వైపు చిన్న సైజులో ఉండే రంగు రంగుల ప్లాస్టిక్ బుట్టలను ఉంచారు. అలాగే ఇంకోవైపు ఆ రంగులకు మ్యాచ్ అయ్యేలా రంగు రంగు పూలను కూడా ఏర్పాటు చేశారు.
Rottweiler vs Cobra: కోబ్రాను పసిగట్టిన రోట్‌వెల్లర్.. చివరికి జరిగింది చూస్తే దడ పుట్టాల్సిందే..
ఏ రంగు పువ్వును ఆ రంగు బుట్టలో వేయాలనేది ఇక్కడ పరీక్ష. గేమ్ స్టార్ట్ చేయగానే పూల వద్దకు వెళ్లిన పక్షి.. ముందుగా తెల్లటి పువ్వును తీసుకుని, అందే రంగు బుట్టలో పడేసింది. తర్వాత ఒక్కో పువ్వునూ నోట కరుకుకుని, అదే రంగులో ఉన్న బుట్టలో వేస్తూ వచ్చింది. చివరి వరకూ ఎక్కడా (Bird matches colors)చిన్న పొరపాటు కూడా లేకుండా ఎంతో జాగ్రత్తగా ఏ రంగు పూలను ఆ రంగు బుట్లల్లో నింపేసింది.
Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
మనుషులే కాస్త ఆలోచించి చేయాల్సిన ఈ పనిని.. ఈ పక్షి ఏమాత్రం ఆలోచించకుండా చకచకా చేసేసింది. ఈ పక్షి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పక్షి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది వెరీ స్మార్ట్ గురూ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7300కి పైగా లైక్‌లు, 2.64 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..