Share News

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. సీఎం రేవంత్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:42 PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది.

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. సీఎం రేవంత్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election) ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ, నాలుగు రోడ్డు షోలకు రేవంత్‌‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ హై కమాండ్ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 30, 31వ తేదీల్లో ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించనున్నారు. నవంబర్‌ 4, 5వ తేదీల్లో మరో విడత రోడ్డు షోలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి.


రెండు విడతల్లో సీఎం రేవంత్‌‌రెడ్డి ర్యాలీలు: మహేష్ గౌడ్

Adluri Lakshman

జూబ్లీహిల్స్‌లో రెండు విడతల్లో సీఎం రేవంత్‌‌రెడ్డి ర్యాలీలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్‌లో 70 శాతం సంక్షేమ పథకాలు అందాయని ఉద్ఘాటించారు. బీజేపీ ఎంతసేపటికీ మతం పేరుతో ఓట్లు అడగటం తప్పా హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ దృష్టిలో తనతో సహా ఇతర నేతలందరూ ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హై కమాండ్ అన్ని విషయాలను చూస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లాగా వ్యక్తుల జీవితాల్లోకి తాము తొంగిచూడమని తెలిపారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ విషయం.. వారి వ్యక్తిగత అంశమని.. వాటితో తమకు సంబంధం ఏముందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్

గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 07:49 PM