Share News

IRCTC cancellation charges: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు వాపస్ వస్తుందో తెలుసా?

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:59 PM

అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.

IRCTC cancellation charges: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు వాపస్ వస్తుందో తెలుసా?
IRCTC Ticket cancellation charges

పండుగలు, వివాహాల సీజన్ వచ్చిందంటే చాలు. రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంటాయి. రైళ్ల టికెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే చాలామంది ముందుగానే ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది. అలాంటి సందర్భాల్లో IRCTC టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఎంత ఉంటాయో ముందే తెలుసుకోవడం అవసరం. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిబంధనల ప్రకారం, టికెట్ రద్దు చేసే సమయం, తరగతిని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ప్రత్యేకంగా AC తరగతులపై జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలు ఇలా ఉన్నాయి.


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టికెట్ రకం, రద్దు సమయం ఆధారంగా క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తుంది. ధృవీకరించబడిన టిక్కెట్లు ఎంత ముందుగానే రద్దు చేశామనే దానిపై ఆధారపడి వేర్వేరు ఛార్జీలను విధిస్తుంది. కన్ఫర్మ్ టికెట్‌పై క్యాన్సిలేషన్ ఛార్జీలు కింది విధంగా ఉంటాయి.ఏసీ, తత్కాల్, స్లీపర్ ఇలా ఏఏ తరగతికి ఎంత రీఫండ్ రావచ్చో చూద్దాం.


ప్రయాణానికి 48 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేస్తే:

  • AC ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.240 + జీఎస్టీ

  • AC 2 టైర్ / ఫస్ట్ క్లాస్ – రూ.200 + జీఎస్టీ

  • AC 3 టైర్ / AC చెయిర్ కార్ / 3AC ఎకానమీ – రూ.180 + జీఎస్టీ

  • స్లీపర్ క్లాస్ – రూ.120

  • సెకండ్ క్లాస్ – రూ.60


  • ప్రయాణానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25% వసూలు చేస్తారు (కనీస ఛార్జీలు వర్తిస్తాయి). AC తరగతులకు జీఎస్టీ వర్తిస్తుంది.

  • 12 గంటల నుంచి 4 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 50% కోత విధిస్తారు. అన్ని AC తరగతులకు జీఎస్టీ వర్తిస్తుంది.

  • ప్రయాణానికి 4 గంటల లోపుగా క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు.


ఇవి కూడా చదవండి

నెలకు 9500GB డేటా, 23 ఓటీటీలు ఫ్రీ..BSNL ఫ్రీడమ్ ఫెస్టివల్‌ ఆఫర్

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 06:28 PM