BSNL Freedom Festival Offer: నెలకు 9500GB డేటా, 23 ఓటీటీలు ఫ్రీ..BSNL ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆఫర్
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:46 PM
మీరు ఇంటర్ నెట్ స్పీడుతోపాటు ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా తక్కువ ధరల్లో కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది.
మీరు మంచి ఇంటర్నెట్ నెట్ స్పీడ్, ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నారా? అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను అతి తక్కువ ధరకు ఆస్వాదించే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని BSNL తీసుకొచ్చిన ఈ స్పెషల్ డీల్ టెక్ ప్రియులందరినీ ఆకట్టుకుంటోంది.
రూ. 1000 తగ్గింపు
ఈ ఫ్రీడమ్ Fiber Ruby OTT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కొత్త కనెక్షన్ తీసుకుంటే రూ. 1000 తగ్గింపును అందిస్తున్నారు. కానీ ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా టెక్, మూవీ లవర్స్ దీనిపై ఓ లుక్కేయండి మరి.
Fiber Ruby OTT ప్లాన్ ప్రత్యేకతలు
ఈ ప్లాన్‌లో మీరు 1 Gbps స్పీడ్‌తో నెలకు 9500GB డేటా పొందవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
9500GB పూర్తయిన తర్వాత స్పీడ్ 45 Mbpsకి తగ్గుతుంది. అయితే డేటా పరిమితి మాత్రం ఉండదు. మీరు నెలంతా యూజ్ చేసుకోవచ్చు.
ఇండియాలో ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కాల్స్ అయితే రూ. 1.20/నిమిషానికి వసూలు చేస్తారు.
ఈ ప్లాన్‌లో JioCinema (Hotstar), SonyLIV, LionsGate, Shemaroo, Hungama, EpicOn వంటి 23 టాప్ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్ ఉంది. అంటే ఇంటర్నెట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వినియోగించుకోవచ్చు.
ధరలు & డిస్కౌంట్ వివరాలు
మంత్లీ ప్లాన్: నెలకు రూ. 4,799 చెల్లిస్తే పై అన్నీ బెనిఫిట్స్ లభిస్తాయి. 9500GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ యాక్సెస్ ఉంటుంది
6 నెలల ప్లాన్: రూ. 28,794. దీనిపై రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. నెలకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ దీనిలో అలాగే ఉంటాయి
12 నెలల ప్లాన్: రూ. 57,588. మీరు ఒక నెల ఫ్రీగా సర్వీస్ అదనంగా పొందవచ్చు. అలాగే రూ. 1000 తగ్గింపు కూడా ఉంటుంది.
24 నెలల ప్లాన్: రూ. 1,15,176 ఇందులో మూడు నెలల వరకు ఫ్రీ సర్వీస్ లభిస్తుంది. అంటే రెండు సంవత్సరాల వరకు టెన్షన్ లేని ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీ దగ్గరలోని BSNL కేంద్రం లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి