Today Top News: టుడే టాప్ న్యూస్ ఇవే..
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:56 PM
దేశవ్యాప్తంగా ఆదివారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఎలక్షన్ కమిషన్ సైతం అదే రీతిలో రియాక్ట్ అయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించారు. అలాగే తెలంగాణలో నీళ్ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలకమైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ప్రాజెక్టులను ఆదివారంనాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రూ.11,000 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టాను. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను దాదాపు 7,716 కోట్లతో చేపట్టారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అనంతపురం, ఆగస్టు 17: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే అక్కడ లేడంటూ వారిని పంపించేందుకు పోలీసులు యత్నించగా.. స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం బిహార్‌లోని సాసారాంలో ఓట్ అధికార్ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర ఆరోపణలు సంధించారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ (ఎస్ఐఆర్) ద్వారా ఓట్లను తొలగించడం, జోడించడం ద్వారా ఎన్నికల్లో ఓట్లను దొంగిలించడానికి కొత్త కుట్ర జరుగుతోందని విమర్శించారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నెల్లూరు: ఓ పాల వ్యాపారి లేదా ఓ పువ్వుల వ్యాపారి ప్రభుత్వాన్ని, పోలీసులను శాసించడం మనం సినిమాల్లో చూస్తుంటాం.. అదే రియల్ లైఫ్‌లో జరిగితే.. అలాంటి కథే నెల్లూరులో వెలుగు చూసింది. ఓ చిన్న బొటిక్ నిర్వహించుకునే మహిళ పోలీసులను, జిల్లా రాజకీయాలను శాసించింది. గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు, పోలీసుల అండదండలతో జిల్లాలో పవుర్ ఫుల్ మహిళగా ఎదిగింది. అప్పట్లో తను చేసిందే.. రైట్, చెప్పిందే వేదం అన్న తీరులో జిల్లాలో ఆమె కార్యకలాపాలు నడిపేది అంటే ఆమె ఎంత పవర్‌ఫుల్ లేడీనో మనం అర్థం చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. 'బీఆర్ఎస్ నేతల మీద కోపం ఉంటే.. రైతులకు శిక్ష వేస్తారా? బురద రాజకీయాల కోసం వరద నీళ్లను సముద్రంలోకి వదలకండి. కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదు. ప్రజలకు కీడు చేస్తే.. అది ప్రభుత్వమే అనుభవిస్తుంది.' అంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ ఎలాంటి వివక్షకు తావివ్వదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఎన్నికల కమిషన్ ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి..
అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని
జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి