Jr NTR Fans : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:55 AM
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అతని కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని..
అనంతపురం, ఆగస్టు 17: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ గురించి ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు.
'తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానన్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా దూషించారో చెప్పాలి. మేము కూడా ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు గోడల మధ్య కాదు.. ఎన్టీఆర్ అభిమానుల ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి' అంటూ జూనియర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..