Share News

Romance on Flight: విమానం కాక్‌పిట్‌లో పైలట్‌ల రొమాన్స్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎయిర్‌హోస్టెస్

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:54 PM

సుదూరాలు ప్రయాణించే విమానాల్లో కొందరు పైలట్‌లు, సిబ్బంది రొమాన్స్‌కు తెరతీస్తారంటూ ఓ ఫారిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఎయిర్‌హోస్టస్ సంచలన విషయం బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Romance on Flight: విమానం కాక్‌పిట్‌లో పైలట్‌ల రొమాన్స్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎయిర్‌హోస్టెస్
Airhostess Cockpit Romance Claims

ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో కాక్‌పిట్‌లో జరిగే చీకటి వ్యవహారాలపై ఓ ఫారిన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టెస్ బయటపెట్టిన విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. నిబంధలను అడ్డుపెట్టుకుని కొందరు పైలట్‌లు, సిబ్బంది విమానం గాల్లో ఉండగానే రొమాన్స్‌కు తెరతీస్తారంటూ సదరు ఎయిర్‌హోస్టెస్ బాంబు పేల్చింది. ఎయిర్‌లైన్స్ వర్గాలకు ఈ వ్యవహారం గురించి తెలిసినా వార్తల్లో మాత్రం ఈ ఉదంతాలు అంతగా కనిపించవని పేర్కొంది.

సియేరా మిస్ట్‌గా సోషల్ మీడియా జనాలకు పరిచయమైన ఆమె ఈ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. ఈ రోమాన్స్‌కు, హైమైల్ క్లబ్ పార్టీలన్న పేరు కూడా స్థిరపడిందని తెలిపింది. పైలట్‌లకు, క్రూకు ఒకరిపై మరొకరికి మక్కువ ఉన్న సందర్భాల్లో ఈ రోమాన్సులు మొదలవుతాయని తెలిపింది. సుదూరాలు ప్రయాణించే విమానాల్లో ఎక్కువగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని వెల్లడించింది.


సియేరా తెలిపిన వివరాల ప్రకారం, పైలట్‌లకు విమానం సిబ్బందిని (క్రూ) కాక్‌పిట్‌లోకి పిలిచే అధికారం ఉంది. సహచర పైలట్‌ వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు లేదా అదనపు సాయం కోసమో క్రూను కాక్‌పిట్‌లోకి పిలవొచ్చు. ఈ నిబందనను అడ్డం పెట్టుకుని కొందరు పైలట్‌లు, క్రూ కాక్‌పిట్ వేదికగా రొమాన్స్‌కు తెరతీస్తారని సియేరా తెలిపింది. అప్పటికే రొమాంటిక్ బంధంలో ఉన్న జంటలు ఇలాంటి పనులు చేస్తుంటాయని పేర్కొంది. ఈ సమయంలో విమానాన్ని ఆటోపైలట్‌పై పెడతారని కూడా చెప్పుకొచ్చింది.

సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసే రెస్ట్ డెక్‌ కూడా ఇలాంటి రొమాన్స్‌కు వేదిక అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ప్రదేశం ప్యాసింజర్లకు కనబడదని, సిబ్బంది మాత్రమే దీన్ని వినియోగించగలరని తెలిపింది. సుదూర ప్రయాణాల సందర్భంగా విమానం ఎత్తులో ప్రయాణిస్తున్న సందర్భాల్లో పైలట్ నిరంతర పర్యవేక్షణ అవసరం ఉండదని ఆమె తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి రొమాన్స్‌కు తెరలేస్తుందని వివరించింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవీ చదవండి:

పులికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారి.. చిన్న మిస్టేక్‌తో ప్రాణం పొగొట్టుకున్న మేక

నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Aug 17 , 2025 | 05:04 PM