Minister Lokesh: జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:54 PM
జగన్‌కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవని లోకేశ్ విమర్శించారు. ఐదేళ్లు సీఎం పదవిని అనుభవించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కనీసం స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయన అవివేకమని ఆరోపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఇది మన స్వాతంత్ర్య పోరాటాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకుగాను.. భారతీయులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇన్సెల్ట్స్ నేషన్ అనే ట్యాగ్ లైన్‌లతో మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
జగన్‌కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవని లోకేశ్ విమర్శించారు. ఐదేళ్లు సీఎం పదవిని అనుభవించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కనీసం స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయన అవివేకమని ఆరోపించారు. ప్రతిఒక్కరూ ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటారని తెలిపారు. జగన్ ఎక్కడా పాల్గొనక పోవడానికి కారణం వైసీపీ నేతలే చెప్పాలని చురకలు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ