Minister Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:02 PM
మంత్రి నారా లోకేశ్ రేపు(సోమవారం) ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు మంత్రి నారా లోకేశ్ ఇవాళ(ఆదివారం) రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(సోమవారం) పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఇటివల కేంద్ర ప్రభుత్వం ఏపీకి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కేంద్ర మంత్రులతో ప్రధాన చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మంత్రి నారా లోకేశ్ రేపు(సోమవారం) ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. సమావేశాల్లో భాగంగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ సమావేశం కానున్నారు. అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. చర్చల్లో భాగంగా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి