Minister Anam Fires On Jagan: జగన్ ప్రభుత్వం హిందూ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించింది: మంత్రి ఆనం
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:34 PM
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
నెల్లూరు, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మానికి, ఆచార కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Rama Narayana Reddy) ఉద్ఘాటించారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో హిందూ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హిందూ ధర్మ హామీలని 98 శాతం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు.
వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ఉత్సవాలను పెనుగొండలో నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు ఏపీలోని 5600 ఆలయాలకి రూ.10వేలు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. వేద విద్యార్థులకి నెలకు రూ.3వేల చొప్పున ఆరు వందల మందికి భృతి అందిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
అర్చకులకి రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఉద్ఘాటించారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని గుర్తుచేశారు. ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకి రూ.25 వేల భృతి కల్పిస్తున్నామని తెలిపారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన
ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మంత్రి లోకేష్ నమ్మకం కలిగించారు: ఎమ్మెల్సీ రవిచంద్ర
Read Latest AP News And Telugu News