Share News

AP Ministers Visits South Korea: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:48 AM

దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు.

AP Ministers Visits South Korea: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన
AP Ministers Visits South Korea

అమరావతి/దక్షిణ కొరియా: దక్షిణ కొరియా (South Korea)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల (Andhra Pradesh Ministers) బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల (AP investments) సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్నారు మంత్రులు నారాయణ (Narayana), బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి ఈ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ(మంగళవారం) ఉదయం కియా(KIA) కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్‌ని సందర్శించారు మంత్రులు.

ministers.--7jpg.jpg


కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు మంత్రుల బృందం. గ్లోబల్ మార్కెట్‌‌లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్‌ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్‌కు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై మాట్లాడారు మంత్రుల బృందం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు వివరించారు మంత్రులు. విశాఖపట్నంలో నవంబర్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు కియా ప్రతినిధులను ఏపీ మంత్రులు ఆహ్వానించారు.

ministers.-4.jpg


ఇవి కూడా చదవండి..

220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. భయాందోళనలో గ్రామస్తులు

కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 12:12 PM