Share News

Tower Incident Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. చివరకు

ABN , Publish Date - Sep 30 , 2025 | 09:21 AM

అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్‌చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.

Tower Incident Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. చివరకు
Tower Incident Tirupati

తిరుపతి, సెప్టెంబర్ 30: కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతాఇంతా కాదు. అలాగే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా కొందరు వ్యక్తులు చేసే విధ్యంసం అక్కడి వారిని భయాందోళనకు గురయ్యేలా చేస్తుంది. భార్య పుట్టింటి వెళ్లిందని, అప్పుల వాళలు వేధిస్తున్నారంటూ అనేక మంది సెల్‌ఫోన్ టవర్లు, వాటర్ ట్యాంక్‌లు ఎక్కి నానా రభస చేస్తుంటారు. ఇలాంటి ఘటనే తిరుపతిలోనూ చోటు చేసుకుంది. ఈ వ్యక్తి ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కి మరీ హంగామా చేశాడు. కానీ చివరకు అతని కథ విషాదంగా ముగిసింది.


రేణిగుంట మండలం గురవరాజు పల్లిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి పొలాలలోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస చేశాడు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్‌చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెంటనే అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందకు దించే పనిలో పడ్డారు. అయితే టవర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో కిందకి మాటల కమ్యూనికేషన్ లేదు. దీంతో సదరు వ్యక్తి ఏం చెబుతున్నాడనేది తెలియని పరిస్థితి.


అసలు అతను ఎందుకు టవర్ ఎక్కాడో కూడా తెలియటం లేదు. టవర్ ఎక్కే ప్రయత్నం చేస్తే ఎక్కడ దూకేస్తాడో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే 220 కేవీ విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. అయితే టవర్ ఎక్కిన వ్యక్తి శివగా గుర్తించారు. చివరకు ఆ వ్యక్తి 120 అడుగులపై నుంచి విద్యుత్ తీగకు వేలాడుతూ దూకాడు. ఆ వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీం... శివ కింద పడకుండా వలలు పట్టారు. చాలా ఎత్తులో నుంచి కింద పడటంతో అతడి తల నేలకు తాకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ వ్యక్తి కిందకు దిగుతాడా లేదా అనే ఉత్కంఠతో రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉన్న గ్రామస్థులు.. అతడు చనిపోయాడని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ఎందుకమ్మా ఇంత నిర్దయ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 12:05 PM