Share News

Krishna Godavari flood update: కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:09 AM

కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆ రెండు నదులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Krishna Godavari flood update: కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
floods in Andhra Pradesh 2025

కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ( AP flood news). భారీ వర్షాల నేపథ్యంలో ఆ రెండు నదులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48.7అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10, 27, 276 క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి (Godavari river flood).


ఇక, కృష్ణా నది కూడా పరవళ్లు తొక్కుతోంది (Krishna river flood). ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులుగా ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వరద ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని, విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని సూచించారు.


ఇవీ చదవండి:

కుటుంబాల సంపద మరింత పైకి

ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 08:09 AM