Beeda Ravi Chandra Meets Lokesh: ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మంత్రి లోకేష్ నమ్మకం కలిగించారు: ఎమ్మెల్సీ రవిచంద్ర
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:32 PM
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.
అమరావతి, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి తల్లిదండ్రుల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) నమ్మకం కలిగించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ (Beeda Ravichandra Yadav) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేద్దామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు కేఎల్ఎస్ ఆర్ ఇన్‌ఫ్రా నుంచి లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను లోకేష్‌కు అందజేశానని తెలిపారు. ఉండవల్లి నివాసంలో లోకేష్‌ని కలిసి పేద విద్యార్థుల కోసం పుస్తకాలు, పెన్నులను కేఎల్ఎస్ ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ అధినేత శ్రీధర్ రెడ్డితో కలిసి అందజేశామని పేర్కొన్నారు రవిచంద్ర యాదవ్.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ(మంగళవారం) విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను లోకేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. పూలబొకేల బదులు విద్యార్థుల సహాయార్ధం పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని లోకేష్ చెప్పారని.. ఈ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలని సూచించారు రవిచంద్ర యాదవ్.
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 15నెలల్లోనే విద్యుత్ చార్జీలు తగ్గించి సీఎం చంద్రబాబు చూపించారని పేర్కొన్నారు. మెరుగైన విద్యుత్ సంస్కరణల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు. అవాస్తవ ప్రచారాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Read Latest AP News And Telugu News